Logo

జెకర్యా అధ్యాయము 14 వచనము 19

ద్వితియోపదేశాకాండము 11:10 మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశమువంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి.

ద్వితియోపదేశాకాండము 11:11 మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.

కీర్తనలు 9:19 యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురు గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక.

యెషయా 19:1 ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది

యెషయా 19:5 సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేలయగును

యెషయా 66:24 వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.

యెహెజ్కేలు 29:2 నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశమంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా

యోవేలు 3:19 ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును.

ఆమోసు 3:2 అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును.

జెకర్యా 14:16 మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.