Logo

లేవీయకాండము అధ్యాయము 18 వచనము 16

లేవీయకాండము 20:21 ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.

ద్వితియోపదేశాకాండము 25:5 సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెనిమిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.

మత్తయి 14:3 ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా,

మత్తయి 14:4 హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించియుండెను.

మత్తయి 22:24 బోధకుడా, ఒకడు పిల్లలులేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే చెప్పెను;

మార్కు 6:17 హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక

మార్కు 12:19 బోధకుడా, తన భార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను.

లూకా 3:19 అయితే చతుర్థాధిపతియైన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు

ఆదికాండము 38:8 అప్పుడు యూదా ఓనానుతో నీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పెను.

మార్కు 6:18 ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి, చెరసాలలో బంధించియుండెను.