Logo

లేవీయకాండము అధ్యాయము 18 వచనము 20

లేవీయకాండము 20:10 పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.

నిర్గమకాండము 20:14 వ్యభిచరింపకూడదు.

ద్వితియోపదేశాకాండము 5:18 వ్యభిచరింపకూడదు.

ద్వితియోపదేశాకాండము 22:22 ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడినయెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.

ద్వితియోపదేశాకాండము 22:25 ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్ఫుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను.

2సమూయేలు 11:3 ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా

2సమూయేలు 11:4 దావీదు దూతలచేత ఆమెను పిలువనంపెను. ఆమె అతనియొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.

2సమూయేలు 11:27 అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.

సామెతలు 6:25 దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొననియ్యకుము.

సామెతలు 6:29 తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.

సామెతలు 6:30 దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలినయెడల యెవరును వాని తిరస్కరింపరు గదా.

సామెతలు 6:31 వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను.

సామెతలు 6:32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే

సామెతలు 6:33 వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.

మలాకీ 3:5 తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను, నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

మత్తయి 5:27 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా;

మత్తయి 5:28 నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.

రోమీయులకు 2:22 వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?

1కొరిందీయులకు 6:9 అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను

గలతీయులకు 5:19 శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

హెబ్రీయులకు 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

సంఖ్యాకాండము 5:13 ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను,

యెహెజ్కేలు 18:6 పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు,

యెహెజ్కేలు 22:11 ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును, మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు.