Logo

లేవీయకాండము అధ్యాయము 20 వచనము 16

లేవీయకాండము 18:24 వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి.

లేవీయకాండము 18:25 ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కివేయుచున్నది.

నిర్గమకాండము 19:13 ఎవడును చేతితో దాని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను, మనుష్యుడుగాని మృగముగాని బ్రదుకకూడదు, బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెననెను.

నిర్గమకాండము 21:28 ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే ఆ యెద్దు యజమానుడు నిర్దోషియగును.

నిర్గమకాండము 21:32 ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచినయెడల వారి యజమానునికి ముప్పది తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్టవలెను.

హెబ్రీయులకు 12:20 ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి.

నిర్గమకాండము 22:19 మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.

లేవీయకాండము 17:4 ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును;

లేవీయకాండము 18:23 ఏ జంతువునందును నీ స్ఖలనముచేసి దానివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.

లేవీయకాండము 20:9 ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.

లేవీయకాండము 24:15 మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.

2సమూయేలు 1:16 నీ నోటి మాటయే నీమీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.