Logo

లేవీయకాండము అధ్యాయము 20 వచనము 19

లేవీయకాండము 18:12 నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.

లేవీయకాండము 18:13 నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.

లేవీయకాండము 18:14 నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి.

లేవీయకాండము 18:15 నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.

లేవీయకాండము 18:16 నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.

లేవీయకాండము 18:17 ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్తసంబంధులు; అది దుష్కామప్రవర్తన.

లేవీయకాండము 18:18 నీ భార్య బ్రదికియుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసికొనకూడదు.

లేవీయకాండము 18:19 అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.

లేవీయకాండము 18:20 నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొనకూడదు.

లేవీయకాండము 18:21 నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.

లేవీయకాండము 18:22 స్త్రీ శయనమువలె పురుష శయనము కూడదు; అది హేయము.

లేవీయకాండము 18:23 ఏ జంతువునందును నీ స్ఖలనముచేసి దానివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.

లేవీయకాండము 18:24 వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి.

లేవీయకాండము 18:25 ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కివేయుచున్నది.

లేవీయకాండము 18:26 కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతనుబట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు,

లేవీయకాండము 18:27 అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక,

లేవీయకాండము 18:28 యీ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను.

లేవీయకాండము 18:29 ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలొనుండి కొట్టివేయబడుదురు.

లేవీయకాండము 18:30 కాబట్టి మీకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొనకుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.

నిర్గమకాండము 6:20 అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

లేవీయకాండము 18:6 మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.

నిర్గమకాండము 28:43 వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధస్థలములో సేవచేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను, వారు దోషులై చావక యుండునట్లు అది అహరోనుమీదను అతని కుమారులమీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ.

లేవీయకాండము 7:18 ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును.

లేవీయకాండము 17:16 అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండినయెడల వాడు తన దోషశిక్షను భరించును.

సంఖ్యాకాండము 14:34 మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు.