Logo

లేవీయకాండము అధ్యాయము 22 వచనము 21

లేవీయకాండము 3:1 అతడు అర్పించునది సమాధానబలియైనయెడల అతడు గోవులలోనిది తీసికొనివచ్చినయెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొనిరావలెను.

లేవీయకాండము 3:6 యెహోవాకు సమాధానబలిగా ఒకడు అర్పించునది గొఱ్ఱ మేకలలోనిదైనయెడల అది మగదేగాని ఆడుదేగాని నిర్దోషమైనదాని తీసికొనిరావలెను.

లేవీయకాండము 7:11 ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా

లేవీయకాండము 7:12 వాడు కృతజ్ఞతార్పణముగా దానినర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంటలను అర్పింపవలెను.

లేవీయకాండము 7:13 ఆ పిండివంటలే కాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.

లేవీయకాండము 7:14 మరియు ఆ అర్పణములలో ప్రతిదానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధానబలి పశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును.

లేవీయకాండము 7:15 సమాధానబలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు.

లేవీయకాండము 7:16 అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దానినర్పించునాడే తినవలెను.

లేవీయకాండము 7:17 మిగిలినది మరునాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంసములో మిగిలినదానిని అగ్నితో కాల్చివేయవలెను.

లేవీయకాండము 7:18 ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును.

లేవీయకాండము 7:19 అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు; అగ్నితో దానిని కాల్చివేయవలెను; మాంసము విషయమైతే పవిత్రులందరు మాంసమును తినవచ్చును గాని

లేవీయకాండము 7:20 ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహోవాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను తినినయెడల వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

లేవీయకాండము 7:21 ఎవడు మనుష్యుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని యే అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలి పశువు మాంసమును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

లేవీయకాండము 7:22 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

లేవీయకాండము 7:23 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఎద్దుదేగాని గొఱ్ఱదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తినకూడదు.

లేవీయకాండము 7:24 చచ్చినదాని క్రొవ్వును చీల్చినదాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్రమును తినకూడదు.

లేవీయకాండము 7:25 ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

లేవీయకాండము 7:26 మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు.

లేవీయకాండము 7:27 ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

లేవీయకాండము 7:28 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

లేవీయకాండము 7:29 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఎవడు యెహోవాకు సమాధానబలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలోనుండి తాను అర్పించునది యెహోవా సన్నిధికి తేవలెను.

లేవీయకాండము 7:30 అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను.

లేవీయకాండము 7:31 యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును.

లేవీయకాండము 7:32 సమాధానబలి పశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజకునికి కుడిజబ్బ నియ్యవలెను.

లేవీయకాండము 7:33 అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును.

లేవీయకాండము 7:34 ఏలయనగా ఇశ్రాయేలీయుల యొద్దనుండి, అనగా వారి సమాధానబలి ద్రవ్యములలోనుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసికొని, నిత్యమైన కట్టడచొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను.

లేవీయకాండము 7:35 వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలోనుండినది అభిషేకమునుబట్టి అహరోనుకును అభిషేకమునుబట్టియే అతని సంతతివారికిని కలిగెను.

లేవీయకాండము 7:36 వీటిని ఇశ్రాయేలీయులు వారికియ్యవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను.

లేవీయకాండము 7:37 ఇది దహనబలిని గూర్చియు అపరాధపరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాపపరిహారార్థబలిని గూర్చియు అపరాధపరిహారార్థబలిని గూర్చియు ప్రతిష్ఠితార్పణమును గూర్చియు సమాధానబలిని గూర్చియు చేయబడిన విధి.

లేవీయకాండము 7:38 ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసికొనిరావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను.

ఆదికాండము 28:20 అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి,

ఆదికాండము 35:1 దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుటనుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా

ఆదికాండము 35:2 యాకోబు తన యింటివారితోను తనయొద్ద నున్న వారందరితోను మీయొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.

ఆదికాండము 35:3 మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నాశ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.

సంఖ్యాకాండము 15:3 యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినేకాని, గొఱ్ఱమేకలలోని దానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల

సంఖ్యాకాండము 15:8 మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచినయెడల

ద్వితియోపదేశాకాండము 23:21 నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.

ద్వితియోపదేశాకాండము 23:22 నీవు మ్రొక్కుకొననియెడల నీయందు ఆ పాపముండదు.

ద్వితియోపదేశాకాండము 23:23 నీ పెదవులనుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను.

కీర్తనలు 50:14 దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

సామెతలు 7:14 సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను

ప్రసంగి 5:4 నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము; బుద్ధిహీనులయందు ఆయనకిష్టము లేదు.

ప్రసంగి 5:5 నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొనకుండుటయే మేలు.

లేవీయకాండము 1:3 అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగదానిని తీసికొనిరావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను.

లేవీయకాండము 1:4 అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.

లేవీయకాండము 19:5 మీరు యెహోవాకు సమాధానబలి అర్పించునప్పుడు అది అంగీకరింపబడునట్లుగా అర్పింపవలెను.

సంఖ్యాకాండము 19:2 యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకములేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీయొద్దకు తీసికొనిరావలెనని వారితో చెప్పుము.

సంఖ్యాకాండము 29:39 మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను.