Logo

లేవీయకాండము అధ్యాయము 22 వచనము 28

నిర్గమకాండము 23:19 నీ భూమి ప్రథమ ఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు.

నిర్గమకాండము 34:26 నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను.

ద్వితియోపదేశాకాండము 14:21 చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.

ద్వితియోపదేశాకాండము 22:6 గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనే గాని నేలమీదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడినయెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్నయెడల పిల్లలతో కూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును

ద్వితియోపదేశాకాండము 22:7 నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసికొనవచ్చును.