Logo

మత్తయి అధ్యాయము 9 వచనము 6

మార్కు 2:9 ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని చెప్పుట సులభమా?

మార్కు 2:10 అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి

మార్కు 2:11 పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.

మార్కు 2:12 తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచిపోయెను గనుక, వారందరు విభ్రాంతినొంది మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.

లూకా 5:23 నీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా?

లూకా 5:24 అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి నీవు లేచి, నీ మంచమెత్తికొని నీ యింటికి వేల్లుమని నీతో చెప్పుచున్నాననెను

లూకా 5:25 వెంటనే వాడు వారి యెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను.

యెషయా 35:5 గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును

యెషయా 35:6 కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును

యోహాను 5:8 యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా

యోహాను 5:9 వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.

యోహాను 5:10 ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.

యోహాను 5:11 అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.

యోహాను 5:12 వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి.

యోహాను 5:13 ఆయన ఎవడో స్వస్థత నొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.

యోహాను 5:14 అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి; మరియెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా

యోహాను 5:17 అయితే యేసు నాతండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను.

యోహాను 5:18 ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందునిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.

అపోస్తలులకార్యములు 3:6 అంతట పేతురు వెండి బంగారములు నాయొద్ద లేవుగాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను; నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి

అపోస్తలులకార్యములు 3:7 వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.

అపోస్తలులకార్యములు 3:8 వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.

అపోస్తలులకార్యములు 3:9 వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి

అపోస్తలులకార్యములు 3:10 శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగినదానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.

అపోస్తలులకార్యములు 3:11 వాడు పేతురును యోహానును పట్టుకొనియుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.

అపోస్తలులకార్యములు 3:16 ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను.

అపోస్తలులకార్యములు 4:9 ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక

అపోస్తలులకార్యములు 4:10 మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.

అపోస్తలులకార్యములు 9:34 పేతురు ఐనెయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా

అపోస్తలులకార్యములు 14:8 అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.

అపోస్తలులకార్యములు 14:9 అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతనివైపు తేరిచూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి

అపోస్తలులకార్యములు 14:10 నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులువేసి నడువసాగెను.

అపోస్తలులకార్యములు 14:11 జనసమూహములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో --దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగివచ్చి యున్నారని కేకలువేసి,

మత్తయి 9:6 అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా