Logo

మత్తయి అధ్యాయము 9 వచనము 18

యెహోషువ 9:4 వారు కపటోపాయము చేసి, రాయబారులమని వేషము వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెలుకట్టి పాతగిలి చినిగి కుట్ట బడియున్న ద్రాక్షా రసపు సిద్దెలు తీసికొని

యోబు 32:19 నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె నున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది.

కీర్తనలు 119:83 నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు.

లేవీయకాండము 19:19 మీరు నాకట్టడలను ఆచరింపవలెను; నీ జంతువులను ఇతరజాతి జంతువులను కలియనీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసినబట్ట వేసికొనకూడదు.

2రాజులు 5:19 నయమాను చెప్పగా ఎలీషా నెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్దనుండి వెళ్లి కొంత దూరము సాగిపోయెను.

మార్కు 2:22 ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను.

లూకా 5:36 ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు; వేసినయెడల క్రొత్తది దానిని చింపివేయును; అదియునుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు.

2కొరిందీయులకు 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;