మత్తయి 17:12 అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారిచేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను
మత్తయి 21:35 ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరియొకనిమీద రాళ్లు రువ్విరి.
మత్తయి 21:36 మరల అతడు మునుపటికంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి.
మత్తయి 22:3 ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి.
మత్తయి 22:4 కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దులును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లివిందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని
మత్తయి 22:5 వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి.
మత్తయి 22:6 తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి.
మత్తయి 23:34 అందుచేత ఇదిగో నేను మీయొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టి పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు
మత్తయి 23:35 నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
మత్తయి 23:36 ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
2దినవృత్తాంతములు 36:16 పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనులమీదికి వచ్చెను.
యిర్మియా 2:30 నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది.
మార్కు 6:27 వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి
మార్కు 6:28 పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదాని కిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను.
మార్కు 6:29 యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి.
మార్కు 9:13 ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
లూకా 9:9 అప్పుడు హేరోదు నేను యోహానును తలగొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను.
ప్రకటన 11:7 వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును.
2సమూయేలు 12:13 నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.
యిర్మియా 26:23 వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసికొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను.
2కొరిందీయులకు 6:5 శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,