Logo

మత్తయి అధ్యాయము 14 వచనము 36

మత్తయి 4:24 ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరిని, దయ్యము పట్టినవారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

మత్తయి 4:25 గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ యను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.

మార్కు 1:28 వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.

మార్కు 1:29 వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారి యింట ప్రవేశించిరి.

మార్కు 1:30 సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.

మార్కు 1:31 ఆయన ఆమె దగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.

మార్కు 1:32 సాయంకాలము ప్రొద్దుగ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి;

మార్కు 1:33 పట్టణమంతయు ఆ యింటి వాకిట కూడియుండెను.

మార్కు 1:34 ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.

మార్కు 2:1 కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను

మార్కు 2:2 ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా

మార్కు 2:3 కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి.

మార్కు 2:4 చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి.

మార్కు 2:5 యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను.

మార్కు 2:6 శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి.

మార్కు 2:7 వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి.

మార్కు 2:8 వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు?

మార్కు 2:9 ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని చెప్పుట సులభమా?

మార్కు 2:10 అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి

మార్కు 2:11 పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.

మార్కు 2:12 తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచిపోయెను గనుక, వారందరు విభ్రాంతినొంది మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.

మార్కు 3:8 మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంతములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి.

మార్కు 3:9 జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధపరచి యుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను.

మార్కు 3:10 ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడుచుండిరి.

మార్కు 6:55 ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినిన చోటునకు రోగులను మంచములమీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి.

మత్తయి 15:30 బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.

మత్తయి 19:2 బహు జనసమూహములు ఆయనను వెంబడింపగా, ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను.