Logo

మత్తయి అధ్యాయము 16 వచనము 1

మత్తయి 14:22 వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.

మార్కు 8:10 ఆయన తన శిష్యులతోకూడ దోనె యెక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చెను.

మత్తయి 13:36 అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి పొలము లోని గురుగులను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి.

మత్తయి 16:5 ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి.