Logo

మత్తయి అధ్యాయము 19 వచనము 12

1కొరిందీయులకు 7:2 అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త యుండవలెను.

1కొరిందీయులకు 7:7 అయినను ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.

1కొరిందీయులకు 7:9 అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లి చేసికొనవచ్చును; కామతప్తులగుటకంటె పెండ్లి చేసికొనుట మేలు.

1కొరిందీయులకు 7:17 అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.

1కొరిందీయులకు 7:35 మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.

1కొరిందీయులకు 7:5 ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.