Logo

మత్తయి అధ్యాయము 19 వచనము 27

ఆదికాండము 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీయొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.

సంఖ్యాకాండము 11:23 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీయెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు.

యోబు 42:2 నీవు సమస్తక్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.

కీర్తనలు 3:8 రక్షణ యెహోవాది నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా.)

కీర్తనలు 62:11 బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.

యిర్మియా 32:27 నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?

జెకర్యా 8:6 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా? యిదే యెహోవా వాక్కు.

మార్కు 10:27 యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.

లూకా 1:37 దేవుడు చెప్పిన యే మాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను.

లూకా 18:27 ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను.

ఆదికాండము 17:1 అబ్రాము తొంబదితొమ్మిది యేండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.

ఆదికాండము 22:8 అబ్రాహాము నాకుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱపిల్లను చూచుకొనునని చెప్పెను.

1సమూయేలు 14:6 యోనాతాను ఈ సున్నతిలేని వారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా

1రాజులు 17:6 అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొని వచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.

1రాజులు 17:16 యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.

దానియేలు 2:11 రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు; దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవుగదా.

మత్తయి 19:24 ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను.

రోమీయులకు 4:21 దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.