Logo

మత్తయి అధ్యాయము 21 వచనము 9

లేవీయకాండము 23:40 మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజిచెట్ల కొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను.

యోహాను 12:13 ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.

2సమూయేలు 3:12 అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు మంచిది; నేను నీతో నిబంధన చేసెదను.

2రాజులు 9:13 అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతనిక్రింద పరచి బాకా ఊదించి యెహూ రాజైయున్నాడని చాటించిరి.

మార్కు 11:7 వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను.

లూకా 19:36 ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి.

యోహాను 6:66 అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.

యోహాను 12:12 మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని