Logo

మత్తయి అధ్యాయము 21 వచనము 25

మత్తయి 10:16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.

సామెతలు 26:4 వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.

సామెతలు 26:5 వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.

లూకా 6:9 అప్పుడు యేసు విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి

కొలొస్సయులకు 4:6 ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.

దానియేలు 2:45 చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహా దేవుడు ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.

మత్తయి 11:9 మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.

మార్కు 11:29 అందుకు యేసు నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకుత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును.