Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 16 వచనము 21

అపోస్తలులకార్యములు 18:2 యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చినవారు.

అపోస్తలులకార్యములు 19:34 అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏక శబ్దముతో రెండు గంటలసేపు ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి.

ఎజ్రా 4:12 తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు.

ఎజ్రా 4:13 కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టినయెడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని యియ్యక యుందురు, అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును.

ఎజ్రా 4:14 మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండ మేము చూడవలెనని ఈ యుత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియజేసితివిు.

ఎజ్రా 4:15 మరియు తమ పూర్వికులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినయెడల, ఈ పట్టణపువారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదురనియు, అందువలననే యీ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజులవలననే తమకు తెలియవచ్చును.

ఎస్తేరు 3:8 అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరియున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు.

ఎస్తేరు 3:9 రాజునకు సమ్మతియైతే వారు హతము చేయబడునట్లును, నేను ఆ పనిచేయువారికి ఇరువదివేల మణుగుల వెండిని రాజుయొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును, చట్టము పుట్టించుమనగా

అపోస్తలులకార్యములు 17:6 అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చియున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు

అపోస్తలులకార్యములు 17:7 వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.

అపోస్తలులకార్యములు 17:8 ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి.

అపోస్తలులకార్యములు 28:22 అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీవలన వినగోరుచున్నాము; ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియుననిరి.

1రాజులు 18:17 అహాబు ఏలీయాను చూచి ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడవు నీవే కావా యని అతనితో అనగా

1రాజులు 18:18 అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు.

మత్తయి 2:3 హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.

యోహాను 15:18 లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.

యోహాను 15:19 మీరు లోకసంబంధులైనయెడల లోకము తనవారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.

యోహాను 15:20 దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల మీ మాటకూడా గైకొందురు

రోమీయులకు 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.

యాకోబు 4:4 వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

నిర్గమకాండము 5:4 అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోనూ, ఈ జనులు తమ పనులను చేయకుండ మీరేల ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను.

యిర్మియా 15:10 అయ్యో నాకు శ్రమ; నా తల్లీ, జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేల నన్ను కంటివి? వడ్డికి నేను బదులియ్యలేదు, వారు నాకు బదులిచ్చినవారు కారు అయినను వారందరు నన్ను శపించుచున్నారు.

యిర్మియా 38:4 ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము.

దానియేలు 3:8 ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి

మార్కు 13:9 మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభలకప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతులయెదుటను రాజులయెదుటను నా నిమిత్తము నిలువబడెదరు.

లూకా 23:2 ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.

అపోస్తలులకార్యములు 16:37 అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి, యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము; వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసికొనిపోవలెనని చెప్పెను

అపోస్తలులకార్యములు 21:30 పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను.

అపోస్తలులకార్యములు 24:5 ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి,

2కొరిందీయులకు 6:8 ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.

యాకోబు 2:6 అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే గదా?