Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 22 వచనము 24

అపోస్తలులకార్యములు 7:53 దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను.

అపోస్తలులకార్యములు 26:11 అనేక పర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని

ప్రసంగి 10:3 బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును.

దానియేలు 6:6 కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి రాజగు దర్యావేషూ, చిరంజీవివై యుందువుగాక.

మత్తయి 27:23 అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

మార్కు 15:14 అందుకు పిలాతు ఎందుకు? అతడే చెడుకార్యము చేసెనని వారినడుగగా వారు వానిని సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

అపోస్తలులకార్యములు 7:54 వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి.

అపోస్తలులకార్యములు 16:22 అప్పుడు జనసమూహము వారిమీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులును వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి.

అపోస్తలులకార్యములు 17:6 అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చియున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు

అపోస్తలులకార్యములు 24:6 మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి.

2కొరిందీయులకు 6:5 శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,

ఎఫెసీయులకు 4:31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.