Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 22 వచనము 30

అపోస్తలులకార్యములు 22:24 వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను.

హెబ్రీయులకు 11:35 స్త్రీలు మృతులైన తమవారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.

అపోస్తలులకార్యములు 22:25 వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.

అపోస్తలులకార్యములు 22:26 శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను.

అపోస్తలులకార్యములు 16:38 ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా, వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి,

అపోస్తలులకార్యములు 16:39 వారిని బతిమాలుకొని వెలుపలికి తీసికొనిపోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి.

మత్తయి 27:2 ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.

అపోస్తలులకార్యములు 21:33 పై యధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని, రెండు సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించి ఇతడెవడు? ఏమి చేసెనని అడుగగా,