Logo

1కొరిందీయులకు అధ్యాయము 1 వచనము 17

1కొరిందీయులకు 16:15 స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమఫలమై యున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును.

1కొరిందీయులకు 16:17 స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను.

అపోస్తలులకార్యములు 16:15 ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె--నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.

అపోస్తలులకార్యములు 16:33 రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.