Logo

1కొరిందీయులకు అధ్యాయము 3 వచనము 13

కీర్తనలు 19:10 అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారుకంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనె ధారలకంటెను మధురమైనవి.

కీర్తనలు 119:72 వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.

సామెతలు 8:10 వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి.

సామెతలు 16:16 అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.

యెషయా 60:17 నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.

1తిమోతి 4:6 ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల, నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవై యుందువు.

2తిమోతి 2:20 గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును.

1పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

ప్రకటన 3:18 నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.

యెషయా 54:11 ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును

యెషయా 54:12 మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును.

యెషయా 54:13 నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.

ప్రకటన 21:18 ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది.

సామెతలు 30:6 ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.

యిర్మియా 23:28 కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.

మత్తయి 15:6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.

మత్తయి 15:7 వేషధారులారా

మత్తయి 15:8 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;

మత్తయి 15:9 మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి

అపోస్తలులకార్యములు 20:30 మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.

రోమీయులకు 16:17 సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయువారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.

2కొరిందీయులకు 2:17 కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యము గలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవుని యెదుట బోధించుచున్నాము.

2కొరిందీయులకు 4:2 అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము

కొలొస్సయులకు 2:8 ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.

కొలొస్సయులకు 2:18 అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనస్సువలన ఊరక ఉప్పొంగుచు,

కొలొస్సయులకు 2:19 శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది.

కొలొస్సయులకు 2:20 మీరు క్రీస్తుతోకూడ లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకుచున్నట్టుగా

కొలొస్సయులకు 2:21 మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిచేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేల?

కొలొస్సయులకు 2:22 అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.

కొలొస్సయులకు 2:23 అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు

1తిమోతి 4:1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మల యందును

1తిమోతి 4:2 దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.

1తిమోతి 4:3 ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.

1తిమోతి 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.

1తిమోతి 6:3 ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైన బోధనుపదేశించినయెడల

2తిమోతి 2:16 అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు.

2తిమోతి 2:17 కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు;

2తిమోతి 2:18 వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.

2తిమోతి 3:7 సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు.

2తిమోతి 3:13 అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.

2తిమోతి 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురదచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,

తీతుకు 1:9 తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.

తీతుకు 1:10 అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు.

తీతుకు 1:11 వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు.

తీతుకు 3:9 అవివేక తర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.

తీతుకు 3:10 మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.

తీతుకు 3:11 అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు.

హెబ్రీయులకు 13:9 నానావిధములైన అన్యబోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనములనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగలేదు.

ప్రకటన 2:14 అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలి యిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు

నిర్గమకాండము 5:12 అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదిరిపోయిరి.

1రాజులు 5:17 రాజు సెలవియ్యగా వారు మందిరముయొక్క పునాదిని చెక్కినరాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి.

యెషయా 5:24 సైన్యములకధిపతియగు యెహోవాయొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్లిపోవును వారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును.

యెహెజ్కేలు 24:11 తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడియై మెరుగు పట్టువరకు వట్టిచట్టి పొయ్యిమీదనే యుంచుము.

ఓబధ్యా 1:18 మరియు యాకోబు సంతతివారు అగ్నియు, యోసేపు సంతతివారు మంటయు అగుదురు; ఏశావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు; ఏశావు సంతతివారిలో ఎవడును తప్పించుకొనకుండ యోసేపు సంతతివారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట యిచ్చియున్నాడు.

మత్తయి 15:13 ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును.

మత్తయి 25:19 బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను.

1కొరిందీయులకు 3:15 ఒకని పని కాల్చివేయబడినయెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలోనుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

ప్రకటన 21:6 మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.