Logo

1కొరిందీయులకు అధ్యాయము 7 వచనము 21

1కొరిందీయులకు 7:17 అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.

1కొరిందీయులకు 7:21 దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది.

1కొరిందీయులకు 7:22 ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.

1కొరిందీయులకు 7:23 మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.

సామెతలు 27:8 తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.

లూకా 3:10 అందుకు జనులు ఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా

లూకా 3:11 అతడు రెండు అంగీలు గలవాడు ఏమియు లేనివానికియ్యవలెననియు, ఆహారము గలవాడును ఆలాగే చేయవలెననియు వారితో చెప్పెను.

లూకా 3:12 సుంకరులును బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా

లూకా 3:13 అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటె ఎక్కువ తీసికొనవద్దని వారితో చెప్పెను.

లూకా 3:14 సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడు ఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొంది యుండుడని వారితో చెప్పెను.

1దెస్సలోనీకయులకు 4:11 సంఘమునకు వెలుపటివారియెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక,

2దెస్సలోనీకయులకు 3:12 అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము.

ఆదికాండము 39:2 యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను.

1కొరిందీయులకు 7:24 సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను.

1కొరిందీయులకు 7:27 భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు.