Logo

2కొరిందీయులకు అధ్యాయము 8 వచనము 22

రోమీయులకు 12:17 కీడుకు ప్రతికీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి.

ఫిలిప్పీయులకు 4:8 మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి.

1తిమోతి 5:14 కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను.

తీతుకు 2:5 మంచి ఉపదేశము చేయువారునై యుండవలెననియు బోధించుము.

తీతుకు 2:6 అటువలెనే స్వస్థబుద్ది గలవారై యుండవలెనని యౌవన పురుషులను హెచ్చరించుము.

తీతుకు 2:7 పరపక్షమందుండువాడు మనలనుగూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము.

తీతుకు 2:8 నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.

1పేతురు 2:12 అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను

2కొరిందీయులకు 2:17 కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యము గలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవుని యెదుట బోధించుచున్నాము.

2కొరిందీయులకు 5:9 కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.

2కొరిందీయులకు 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

2కొరిందీయులకు 5:11 కావున మేము ప్రభువు విషయమైన భయమునెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.

మత్తయి 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.

మత్తయి 6:1 మనుష్యులకు కనబడవలెనని వారి యెదుట మీ నీతికార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.

మత్తయి 6:4 అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును

మత్తయి 23:5 మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;

1దెస్సలోనీకయులకు 5:22 ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.

ఆదికాండము 31:32 ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నాయొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు.

ఆదికాండము 43:12 రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడచేత పట్టుకొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును;

రూతు 3:14 కాబట్టి ఆమె ఉదయము వరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకనినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను.

రూతు 4:4 ఈ పుర నివాసుల యెదుటను నా జనుల పెద్దల యెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనినయెడల విడిపింపుము, దాని విడిపింపనొల్లనియెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు నేను విడిపించెదననెను.

1రాజులు 18:34 అదియైన తరువాత రెండవమారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవమారును ఆలాగు చేసిరి; మూడవమారును చేయుడనగా వారు మూడవమారును చేసిరి; అప్పుడు

2రాజులు 22:7 ఆ అధికారులు నమ్మకస్థులని వారిచేతికి అప్పగించిన ద్రవ్యమునుగూర్చి వారియొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి.

ఎజ్రా 8:25 మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులును అధిపతులును అక్కడ నున్న ఇశ్రాయేలీయులందరును ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని.

ఎజ్రా 8:33 నాలుగవ దినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితో కూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడ నుండిరి.

యిర్మియా 32:12 అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయ పత్రములో చేవ్రాలు చేసిన సాక్షులయెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదు లందరియెదుటను, నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నులయెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని.

అపోస్తలులకార్యములు 4:35 వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను.

అపోస్తలులకార్యములు 10:23 మరునాడు అతడు లేచి, వారితో కూడ బయలుదేరెను; యొప్పేవారైన కొందరు సహోదరులును వారితో కూడ వెళ్లిరి.

రోమీయులకు 14:16 మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి.

రోమీయులకు 14:18 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు.

1కొరిందీయులకు 10:29 మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షినిబట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?

2కొరిందీయులకు 13:7 మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము; మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు గాని, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము.

1దెస్సలోనీకయులకు 4:12 మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీచేతులతో పనిచేయుట యందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.

1తిమోతి 3:7 మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందినవాడై యుండవలెను.