Logo

2కొరిందీయులకు అధ్యాయము 8 వచనము 24

2కొరిందీయులకు 8:6 కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో ఆలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడుకొంటిమి.

2కొరిందీయులకు 8:16 మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము.

2కొరిందీయులకు 7:6 అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను.

2కొరిందీయులకు 12:18 మీయొద్దకు వెళ్లుటకు తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మవలననే ఒక్క అడుగుజాడలయందే నడుచుకొనలేదా?

లూకా 5:7 వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.

లూకా 5:10 ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయమొందిరి). అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.

ఫిలేమోనుకు 1:17 కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము.

ఫిలిప్పీయులకు 2:25 మరియు నా సహోదరుడును, జత పనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీయొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని.

ఫిలిప్పీయులకు 4:3 అవును, నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా యితర సహకారులతోను సువార్త పనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాన

కొలొస్సయులకు 1:7 ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.

1దెస్సలోనీకయులకు 2:2 మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును.

ఫిలేమోనుకు 1:24 నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు.

3యోహాను 1:8 మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టివారికి ఉపకారము చేయ బద్ధులమై యున్నాము.

2కొరిందీయులకు 8:19 అంతేకాక మన ప్రభువునకు మహిమకలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి

ఫిలిప్పీయులకు 2:25 మరియు నా సహోదరుడును, జత పనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీయొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని.

అపోస్తలులకార్యములు 20:4 మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితోకూడ వచ్చిరి.

2కొరిందీయులకు 2:13 నా మనస్సులో నెమ్మదిలేక వారియొద్ద సెలవు తీసికొని అక్కడనుండి మాసిదోనియకు బయలుదేరితిని.

2కొరిందీయులకు 8:18 మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధిచెందిన సహోదరుని అతనితో కూడ పంపుచున్నాము.

గలతీయులకు 2:1 అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడ యెరూషలేమునకు తిరిగి వెళ్లితిని.

1దెస్సలోనీకయులకు 3:2 యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితివిు. మేము మీయొద్ద ఉన్నప్పుడు,

తీతుకు 1:4 తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసునుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.