Logo

సంఖ్యాకాండము అధ్యాయము 9 వచనము 1

సంఖ్యాకాండము 1:1 వారు ఐగుప్తు దేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను

నిర్గమకాండము 40:2 మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.

నిర్గమకాండము 40:17 రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను.

సంఖ్యాకాండము 7:66 పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీషదాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీయెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి

సంఖ్యాకాండము 7:73 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

సంఖ్యాకాండము 10:11 రెండవ సంవత్సరము రెండవ నెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరముమీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి.

సంఖ్యాకాండము 10:12 తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.

యెహోషువ 5:10 ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి.