సంఖ్యాకాండము 23:2 బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలామును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి.
సంఖ్యాకాండము 23:14 పిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.
సంఖ్యాకాండము 23:30 బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.
ఆదికాండము 31:54 యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.
సామెతలు 1:16 కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
యిర్మియా 48:35 ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని దేవతలకు ధూపము వేయువారిని మోయాబులో లేకుండజేసెను ఇదే యెహోవా వాక్కు.