Logo

సంఖ్యాకాండము అధ్యాయము 24 వచనము 3

సంఖ్యాకాండము 23:7 అప్పుడు బిలాము ఉపమానరీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకు తూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్ను రప్పించి రమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.

సంఖ్యాకాండము 23:18 బిలాము ఉపమానరీతిగా నిట్లనెను బాలాకూ, లేచి వినుము సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము.

సంఖ్యాకాండము 24:4 అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.

సంఖ్యాకాండము 24:16 దేవవాక్కులను వినినవాని వార్త మహాన్నతుని విద్యనెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.

సంఖ్యాకాండము 22:31 అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారము చేయగా

సంఖ్యాకాండము 24:15 ఉపమానరీతిగా ఇట్లనెను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి.

యోబు 27:1 యోబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను

మీకా 2:4 ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా మనము బొత్తిగా చెడిపోయి యున్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియు, మనయొద్ద నుండకుండ ఆయన దానిని తీసివేసెసేయనియు,మన భూములను తిరుగబడినవారికి ఆయన విభజించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొను చున్నట్లు జనులు చెప్పుకొందురు.

1కొరిందీయులకు 14:37 ఎవడైనను తాను ప్రవక్తనని యైనను ఆత్మసంబంధినని యైనను తలంచుకొనినయెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను.

హెబ్రీయులకు 6:4 ఒకసారి వెలిగింపబడి, పరలోక సంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై