Logo

సంఖ్యాకాండము అధ్యాయము 28 వచనము 19

యెహెజ్కేలు 45:21 మొదటి నెల పదునాలుగవ దినమున పస్కాపండుగ ఆచరింపవలెను; ఏడు దినములు దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను.

యెహెజ్కేలు 45:22 ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును అర్పింపవలెను.

యెహెజ్కేలు 45:23 మరియు ఏడు దినములు అతడు నిర్దోషమైన యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసికొని, దినమొకటింటికి ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను; మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.

యెహెజ్కేలు 45:24 మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండిపట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె యుండవలెను.

యెహెజ్కేలు 45:25 మరియు ఏడవ నెల పదునైదవ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థబలి విషయములోను దహనబలి విషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోను ఆ ప్రకారముగానే చేయవలెను.

సంఖ్యాకాండము 28:31 నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను.

సంఖ్యాకాండము 29:8 ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలియు నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములునుగాక, మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై యుండవలెను.

లేవీయకాండము 22:20 దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు; అది మీ పక్షముగా అంగీకరింపబడదు.

ద్వితియోపదేశాకాండము 15:21 దానిలో లోపము, అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండినయెడల నీ దేవుడైన యెహోవాకు దాని అర్పింపకూడదు.

మలాకీ 1:13 అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు; ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు.

మలాకీ 1:14 నేను ఘనమైన మహారాజునై యున్నాను; అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది యుండగా యెహోవాకు మ్రొక్కుబడిచేసి చెడిపోయినదానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు.

1పేతురు 1:19 అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

సంఖ్యాకాండము 28:11 నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,

సంఖ్యాకాండము 28:27 యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగ గొఱ్ఱపిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను

సంఖ్యాకాండము 29:2 మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు; అది మీకు శృంగధ్వని దినము.

సంఖ్యాకాండము 29:12 మరియు ఏడవ నెల పదునయిదవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను.

సంఖ్యాకాండము 29:13 నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక, యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను.

ఎజ్రా 3:5 తరువాత నిత్యమైన దహనబలిని, అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి.