Logo

సంఖ్యాకాండము అధ్యాయము 30 వచనము 16

సంఖ్యాకాండము 5:29 రోషము విషయమైన విధి యిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవతప్పి అపవిత్రపడినయెడలనేమి,

సంఖ్యాకాండము 5:30 లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడినయెడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమెయెడల సమస్తము విధిచొప్పున చేయవలెను.

లేవీయకాండము 11:46 అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు

లేవీయకాండము 11:47 జంతువులను గూర్చియు, పక్షులను గూర్చియు, జలచరములైన సమస్త జీవులను గూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి యిదే అని చెప్పుమనెను.

లేవీయకాండము 13:59 అప్పుడు అది పవిత్రమగును. బొచ్చుబట్టయందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలువస్తువులయందేగాని యుండు కుష్ఠుపొడనుగూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి యిదే.

లేవీయకాండము 14:54 ప్రతివిధమైన కుష్ఠుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు

లేవీయకాండము 14:55 వస్త్రకుష్ఠమును గూర్చియు, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్ఠమును గూర్చియు,

లేవీయకాండము 14:56 వాపును గూర్చియు, పక్కును గూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు,

లేవీయకాండము 14:57 ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి.

లేవీయకాండము 15:32 స్రావము గలవాని గూర్చియు, వీర్యస్ఖలనమువలని అపవిత్రత గలవాని గూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడినది ఇదే.

లేవీయకాండము 15:33 స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించు వాని గూర్చియు విధింపబడినది ఇదే.

సంఖ్యాకాండము 31:21 అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధియేదనగా