Logo

1సమూయేలు అధ్యాయము 1 వచనము 1

1సమూయేలు 1:19 తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను

మత్తయి 27:57 యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి

న్యాయాధిపతులు 17:1 మీకా అను నొకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశ ములో నుండెను.

న్యాయాధిపతులు 19:1 ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయు డైన యొకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లె హేములోనుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చు కొనగా

1దినవృత్తాంతములు 6:25 ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.

1దినవృత్తాంతములు 6:26 ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,

1దినవృత్తాంతములు 6:27 నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా.

1దినవృత్తాంతములు 6:34 సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయహునకు పుట్టెను,

1సమూయేలు 9:5 అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్లుదము రమ్ము, గార్దభముల కొరకు చింతింపక, నా తండ్రి మనకొరకు విచారపడునేమోయని సౌలు తనయొద్దనున్న పనివానితో అనగా

1సమూయేలు 17:12 దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండుగురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడైయుండెను.

న్యాయాధిపతులు 12:5 ఎఫ్రాయి మీయులతో యుద్ధముచేయుటకై గిలాదువారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీ యులలో ఎవడోనన్ను దాటనియ్యుడని చెప్పినప్పుడు గిలాదువారునీవు ఎఫ్రాయిమీయుడవా అని అతని నడి గిరి.

రూతు 1:2 ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేము వారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి.

1రాజులు 11:26 మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయీమీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లిపేరు జెరూహా, ఆమె విధవరాలు.

ఆదికాండము 35:11 మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు.

ఆదికాండము 48:7 పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను.

నిర్గమకాండము 6:24 కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.

యెహోషువ 18:25 గిబియోను రామా బెయేరోతు మిస్పే

న్యాయాధిపతులు 4:5 ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామా కును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమెయొద్దకు వచ్చు చుండిరి.

1సమూయేలు 7:17 మరియు అతని యిల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.

1దినవృత్తాంతములు 6:26 ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,

1దినవృత్తాంతములు 6:27 నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా.

1దినవృత్తాంతములు 6:35 తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను,

లూకా 23:51 అతడు సజ్జనుడును నీతిమంతుడునై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టుచుండినవాడు.