Logo

1సమూయేలు అధ్యాయము 4 వచనము 7

నిర్గమకాండము 14:25 వారి రథ చక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.

నిర్గమకాండము 15:14 జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును.

నిర్గమకాండము 15:15 ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు. భయము అధిక భయము వారికి కలుగును.

నిర్గమకాండము 15:16 యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.

ద్వితియోపదేశాకాండము 32:30 తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయనియెడల యెహోవా వారిని అప్పగింపనియెడల ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును? ఇద్దరు ఎట్లు పదివేలమందిని పారదోలుదురు?

యోబు 15:25 వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.

కీర్తనలు 60:10 దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మానియున్నావు గదా?

యెషయా 41:6 వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పుకొందురు.

యిర్మియా 18:13 కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అన్యజనులను అడిగి తెలిసికొనుడి; ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైన వినెనా? ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసియున్నది.