Logo

1సమూయేలు అధ్యాయము 11 వచనము 8

న్యాయాధిపతులు 1:4 కనానీయులమీదికి యూదావంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారి కప్పగించెను గనుక వారు బెజెకులో పదివేలమంది మనుష్యులను హతముచేసిరి.

న్యాయాధిపతులు 1:5 వారు బెజెకులో అదోనీ బెజెకును చూచి వానితో యుద్ధముచేసి కనానీయులను పెరిజ్జీయులను హతముచేసిరి.

1సమూయేలు 13:15 సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను; సౌలు తనయొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు ఆరు వందలమంది యుండిరి.

1సమూయేలు 15:4 అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా, కాలుబలము రెండు లక్షలమందియు యూదావారు పదివేలమందియు నుండిరి.

2సమూయేలు 24:9 అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను; ఇశ్రాయేలువారిలో కత్తి దూయగల యెనిమిది లక్షలమంది యోధులుండిరి; యూదా వారిలో అయిదు లక్షలమంది యుండిరి.

2దినవృత్తాంతములు 17:12 యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామగ్రిని నిలువచేయు పట్టణములను కట్టించెను.

2దినవృత్తాంతములు 17:13 యూదాదేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతనిక్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి.

2దినవృత్తాంతములు 17:14 వీరి పితరుల వంశములచొప్పున వీరి సంఖ్య యెంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నాయొద్ద మూడు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.

2దినవృత్తాంతములు 17:15 రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండు లక్షల ఎనుబదివేలమంది యుండిరి.

2దినవృత్తాంతములు 17:16 మూడవవాడు జిఖ్రీ కుమారుడై యెహోవాకు తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా; అతనియొద్ద రెండు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.

2దినవృత్తాంతములు 17:17 బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.

2దినవృత్తాంతములు 17:18 రెండవవాడు యెహోజాబాదు; వీనియొద్ద లక్షయెనుబదివేలమంది యుద్ధసన్నద్ధులుండిరి.

2దినవృత్తాంతములు 17:19 రాజు యూదాయందంతటనుండు ప్రాకార పురములలో ఉంచినవారు గాక వీరు రాజుయొక్క పరివారములో చేరినవారై యుండిరి.

న్యాయాధిపతులు 20:1 అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.

న్యాయాధిపతులు 20:17 బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు నాలుగులక్షలమంది లెక్కింపబడిరి; వీరందరు యోధులు.

2రాజులు 3:6 యెహోరాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను.