Logo

1సమూయేలు అధ్యాయము 12 వచనము 2

1సమూయేలు 8:20 జనములు చేయురీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి.

సంఖ్యాకాండము 27:17 వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.

1సమూయేలు 8:1 సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులమీద న్యాయాధిపతులుగా నియమించెను.

1సమూయేలు 8:5 చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.

కీర్తనలు 71:18 దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమునుగూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమునుగూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరసి వృద్ధునైయుండువరకు నన్ను విడువకుము.

యెషయా 46:3 యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నాచేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకపెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.

యెషయా 46:4 ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.

2తిమోతి 4:6 నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైయున్నది.

2పేతురు 1:14 నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.

1సమూయేలు 2:22 ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకువచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవినిపడగా వారిని పిలిచి యిట్లనెను

1సమూయేలు 2:29 నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు.

1సమూయేలు 3:13 తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.

1సమూయేలు 3:16 అయితే ఏలీ సమూయేలూ నా కుమారుడా, అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేనిక్కడ ఉన్నాననెను.

1సమూయేలు 8:3 వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా

1సమూయేలు 3:19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.

1సమూయేలు 3:20 కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి

1సమూయేలు 14:47 ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీయులతోను సోబాదేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరిమీదికి అతడు పోయెనో వారినందరిని ఓడించెను.

యోబు 23:11 నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము ననుసరించితిని.

కీర్తనలు 26:11 నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము.

సామెతలు 16:31 నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగియుండును.

సామెతలు 22:6 బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.

యెషయా 1:26 మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.