Logo

1సమూయేలు అధ్యాయము 15 వచనము 27

ఆదికాండము 39:12 అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమెచేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.

1సమూయేలు 28:14 అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాని నడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.

1సమూయేలు 28:17 యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీచేతినుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాని నిచ్చియున్నాడు.

1రాజులు 11:30 అంతట అహీయా తాను ధరించుకొనియున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండు తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను ఈ పది తునకలను నీవు తీసికొనుము;

యెహెజ్కేలు 4:1 నరపుత్రుడా, పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దానిమీద వ్రాయుము.

జెకర్యా 8:23 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.

అపోస్తలులకార్యములు 21:11 అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తనచేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనులచేతికి అప్పగింతురని పరిశుద్దాత్మ చెప్పుచున్నాడనెను