Logo

1సమూయేలు అధ్యాయము 19 వచనము 7

1సమూయేలు 16:21 దావీదు సౌలు దగ్గరకువచ్చి అతని యెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను.

1సమూయేలు 18:2 ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనియ్యక సౌలు అతనిని చేర్చుకొనెను.

1సమూయేలు 18:10 మరునాడు దేవుని యొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా1 దావీదు మునుపటిలాగున వీణ చేతపట్టుకొని వాయించెను.

1సమూయేలు 18:13 కాబట్టి సౌలు అతని తనయొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేసెను; అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండెను.

ఆదికాండము 31:2 మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.

నిర్గమకాండము 4:10 అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటిమాంద్యము నాలుకమాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా

1దినవృత్తాంతములు 11:2 ఇంతకుముందు సౌలు రాజైయున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై యుంటివి నా జనులగు ఇశ్రాయేలీయులను నీవు ఏలి వారిమీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవిచేసిరి.

యెషయా 30:33 పూర్వమునుండి తోపెతు1 సిద్ధపరచబడియున్నది అది మొలెకు దేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసియున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.

2రాజులు 13:5 కావున యెహోవా ఇశ్రాయేలువారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతనిచేత ఇశ్రాయేలువారు సిరియనుల వశములోనుండి తప్పించుకొని మునుపటివలె స్వస్థానములలో కాపురముండిరి.

కీర్తనలు 36:3 వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసియున్నాడు.