Logo

1సమూయేలు అధ్యాయము 26 వచనము 5

1సమూయేలు 9:1 అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు.

1సమూయేలు 14:50 సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు, ఇతడు సౌలునకు పిన తండ్రియైన నేరు కుమారుడు.

1సమూయేలు 14:51 సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు.

1సమూయేలు 17:55 సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ, ఈ యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను.

2సమూయేలు 2:8 నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొనిపోయి,

2సమూయేలు 2:9 గిలాదువారిమీదను ఆషేరీయులమీదను యెజ్రెయేలుమీదను ఎఫ్రాయిమీయులమీదను బెన్యామీనీయులమీదను ఇశ్రాయేలు వారిమీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను.

2సమూయేలు 2:10 సౌలు కుమారుడగు ఇష్బోషెతు నలువదేండ్లవాడై యేలనారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను; అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి.

2సమూయేలు 2:11 దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు.

2సమూయేలు 2:12 అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా

2సమూయేలు 3:7 అయ్యా కుమార్తెయైన రిస్పా యను ఒక ఉపపత్ని సౌలుకుండెను నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా

2సమూయేలు 3:8 అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటివారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా?

2సమూయేలు 3:27 అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను.

2సమూయేలు 3:33 మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను.

2సమూయేలు 3:34 ఎట్లనగా అబ్నేరూ నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా?నీచేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండగను దోషకారి యెదుట ఒకడు పడునట్లు నీవు పడితివే రాజు ఈలాగున కీర్తన యెత్తి పాడగా జనులందరు విని మరి యెక్కువగా ఏడ్చిరి.

2సమూయేలు 3:35 ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి సూర్యుడు అస్తమించకమునుపు ఆహారమేమైనను నేను రుచి చూచినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకనెను.

2సమూయేలు 3:36 జనులందరు ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి; రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను.

2సమూయేలు 3:37 నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణవలన నైనది కాదని ఆ దినమున జనులందరికిని ఇశ్రాయేలు వారికందరికిని తెలియబడెను.

2సమూయేలు 3:38 పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెను నేటిదినమున పడిపోయినవాడు ఇశ్రాయేలువారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది.

1దినవృత్తాంతములు 9:39 నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.

1సమూయేలు 17:20 దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి.