Logo

1సమూయేలు అధ్యాయము 28 వచనము 9

1సమూయేలు 28:3 సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములోనుండి వెళ్లగొట్టి యుండెను.

2సమూయేలు 18:13 మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చినయెడల అది రాజునకు తెలియకపోదు, రాజు సన్నిధిని నీవే నాకు విరోధివగుదువు గదా అని యోవాబుతో అనగా

2రాజులు 5:7 ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను.

నిర్గమకాండము 22:18 శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.

ద్వితియోపదేశాకాండము 18:10 తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను