Logo

యోబు అధ్యాయము 25

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

02 అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును.

03 ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా?

04 నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు?

05 ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు.

06 మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.