Logo

2రాజులు అధ్యాయము 6 వచనము 13

1సమూయేలు 23:22 మీరు పోయి అతడు ఉండుస్థలము ఏదయినది, అతనిని చూచినవాడు ఎవడయినది నిశ్చయముగా తెలిసికొనుడి; అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక

1సమూయేలు 23:23 మీరు బహు జాగ్రత్తగానుండి, అతడుండు మరుగు తావులను కనిపెట్టియున్న సంగతియంత నాకు తెలియజేయుటకై మరల నాయొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును, అతడు దేశములో ఎక్కడనుండినను యూదావారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును.

కీర్తనలు 10:8 తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును.

కీర్తనలు 10:9 గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడువారిని పట్టుకొన పొంచియుందురు బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు.

కీర్తనలు 10:10 కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారమువలన నిరాధారులు కూలుదురు.

కీర్తనలు 37:12 భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు.

కీర్తనలు 37:13 వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.

కీర్తనలు 37:14 దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కుపెట్టి యున్నారు

కీర్తనలు 37:32 భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.

కీర్తనలు 37:33 వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు.

యిర్మియా 36:26 లేఖికుడైన బారూకును ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకును అజ్రీయేలు కుమారుడైన శెరాయాకును అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవా వారిని దాచెను.

మత్తయి 2:4 కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.

మత్తయి 2:5 అందుకు వారు యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయ దేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి యున్నదనిరి

మత్తయి 2:6 అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,

మత్తయి 2:7 ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని

మత్తయి 2:8 మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.

యోహాను 11:47 కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.

యోహాను 11:48 మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి.

యోహాను 11:49 అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైయుండి మీకేమియు తెలియదు.

యోహాను 11:50 మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.

యోహాను 11:51 తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక

యోహాను 11:52 యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.

యోహాను 11:53 కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి.

అపోస్తలులకార్యములు 23:12 ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.

అపోస్తలులకార్యములు 23:13 వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలును చంపువరకు ఏమియు రుచిచూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము.

అపోస్తలులకార్యములు 23:14 కాబట్టి మీరు మహాసభతో కలిసి, అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీయొద్దకు తీసికొనిరమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి.

అపోస్తలులకార్యములు 23:15 అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను.

అపోస్తలులకార్యములు 23:16 అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచిఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడుకొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను.

అపోస్తలులకార్యములు 23:17 శతాధిపతి సహస్రాధిపతి యొద్దకతని తోడుకొనిపోయి ఖైదీయైన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ పడుచువానిని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను.

అపోస్తలులకార్యములు 23:18 సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసికొనిపోయి నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని యొంటరిగా అడిగెను.

అపోస్తలులకార్యములు 23:19 అందుకతడు నీవు పౌలునుగూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభయొద్దకు తీసికొని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి యున్నారు.

అపోస్తలులకార్యములు 23:20 వారి మాటకు నీవు సమ్మతింపవద్దు; వారిలో నలువదిమందికంటె ఎక్కువ మనుష్యులు అతనికొరకు పొంచియున్నారు. వారు అతని చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టుపెట్టుకొని యున్నారు; ఇప్పడు నీయొద్ద మాట తీసికొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను.

అపోస్తలులకార్యములు 23:21 అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని యెవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను.

అపోస్తలులకార్యములు 23:22 తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి కైసరయవరకు వెళ్లుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపురౌతులను ఇన్నూరు మంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి

అపోస్తలులకార్యములు 23:23 పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిక్సు నొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధపరచుడని చెప్పెను.

అపోస్తలులకార్యములు 23:24 మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను

అపోస్తలులకార్యములు 23:25 మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.

అపోస్తలులకార్యములు 23:26 యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని.

అపోస్తలులకార్యములు 23:27 వారు అతనిమీద మోపిన నేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభయొద్దకు అతనిని తీసికొనివచ్చితిని.

ఆదికాండము 37:17 అందుకు ఆ మనుష్యుడు ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను

2రాజులు 1:9 వెంటనే రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని యేబదిమందితో కూడ ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండమీద కూర్బునియుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడా, నీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.