Logo

2రాజులు అధ్యాయము 6 వచనము 27

కీర్తనలు 60:11 మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము.

కీర్తనలు 62:8 జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మికయుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము.(సెలా.)

కీర్తనలు 118:8 మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

కీర్తనలు 118:9 రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

కీర్తనలు 124:1 మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల

కీర్తనలు 124:2 వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు

కీర్తనలు 124:3 యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు

కీర్తనలు 127:1 యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే.

కీర్తనలు 146:3 రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి

యెషయా 2:2 అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

యిర్మియా 17:5 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.

ఆదికాండము 41:16 యోసేపు నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను.

సంఖ్యాకాండము 18:27 మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షలతొట్టి ఫలమువలెను ఎంచవలెను.

ద్వితియోపదేశాకాండము 28:8 నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.

1సమూయేలు 28:16 అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటవలన ప్రయోజనమేమి?

2రాజులు 4:2 ఎలీషా నావలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటియున్నది; అది తప్ప మరేమియు లేదనెను.

యోబు 21:4 నేను మనుష్యుని గురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?

కీర్తనలు 107:12 ఆయన ఆయాసము చేత క్రుంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను.

ప్రసంగి 10:13 వాని నోటిమాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెఱ్ఱితనము.