Logo

2రాజులు అధ్యాయము 6 వచనము 32

యెహెజ్కేలు 8:1 ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను.

యెహెజ్కేలు 14:1 అంతట ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నాయొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా

యెహెజ్కేలు 20:1 ఏడవ సంవత్సరము అయిదవ నెల పదియవ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవాయొద్ద విచారణ చేయుటకై నాయొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా

యెహెజ్కేలు 33:31 నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురుగాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది.

2రాజులు 6:12 అతని సేవకులలో ఒకడు రాజవైన నా యేలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను.

2రాజులు 5:26 అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?

లూకా 13:32 ఆయన వారిని చూచి మీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్లగొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవ దినమున పూర్ణసిద్ధి పొందెదను.

1రాజులు 18:4 యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.

1రాజులు 18:13 నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడనియెడల అతడు నన్ను చంపివేయును, ఆలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు, నీ దాసుడనైన నేను బాల్యమునుండి యెహోవాయందు భయభక్తులు నిలిపినవాడను.

1రాజులు 18:14 యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా యేలినవాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రక్తలలో నూరు మందిని గుహకు ఏబదేసి మందిచొప్పున దాచి, అన్న పానములిచ్చి వారిని పోషించితిని.

1రాజులు 21:10 నీవు దేవునిని రాజును దూషించితివని అతనిమీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన యిద్దరు మనుష్యులను సిద్ధపరచుడి; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టుడి.

1రాజులు 14:6 అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు నామె కాలిచప్పుడు విని ఆమెతో ఇట్లనెను యరొబాము భార్యా, లోపలికి రమ్ము; నీవు వేషము వేసికొని వచ్చుటయేల? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞయాయెను.

నిర్గమకాండము 7:1 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును.

2రాజులు 3:2 ఇతడు తన తలిదండ్రులు చేసిన ప్రకారము చేయక, తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను

2రాజులు 5:9 నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారముముందర నిలిచియుండగా

2రాజులు 7:18 మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్ననిపిండియు, రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను.

2రాజులు 8:4 రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాటలాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి యుండెను.

యిర్మియా 32:3 యూదా రాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతని చూచును,

విలాపవాక్యములు 3:39 సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?

అపోస్తలులకార్యములు 5:9 అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొనిపోవుదురని ఆమెతో చెప్పెను

హెబ్రీయులకు 11:34 అగ్ని బలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.