Logo

యోబు అధ్యాయము 13 వచనము 5

యోబు 13:13 నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడి నామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక.

యోబు 11:3 నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండవలెనా? ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యము చేయుదువా?

యోబు 16:3 ఈ గాలిమాటలు ముగిసిపోయెనా? నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?

యోబు 18:2 మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేవు వెదకుదురు? మీరు ఆలోచనచేసి ముగించినయెడల మేము మాటలాడెదము.

యోబు 19:2 ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?

యోబు 21:2 నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.

యోబు 21:3 నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.

యోబు 32:1 యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.

సామెతలు 17:28 ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.

ప్రసంగి 5:3 విస్తారమైన పనిపాటులవలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును.

ఆమోసు 5:13 ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.

యాకోబు 1:19 నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.

యోబు 6:25 యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?

యోబు 15:3 వ్యర్థ సంభాషణచేత వ్యాజ్యెమాడదగునా? నిష్‌ ప్రయోజనమైన మాటలచేత వాదింపదగునా?

యోబు 15:8 నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?

యోబు 15:17 నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును నేను చూచినదానిని నీకు వివరించెదను.

యోబు 16:2 ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు.

యోబు 26:3 జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచన చెప్పితివి? సంగతిని ఎంత చక్కగా వివరించితివి?

యోబు 32:16 కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పకయున్నారు వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరకుందునా?