Logo

యోబు అధ్యాయము 13 వచనము 28

యోబు 30:17 రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడునట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.

యోబు 30:18 మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది.

యోబు 30:19 ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను.

యోబు 30:29 నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.

యోబు 30:30 నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖస్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.

సంఖ్యాకాండము 12:12 తన తల్లి గర్భములోనుండి పుట్టినప్పటికే సగముమాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా

యోబు 4:19 జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

కీర్తనలు 39:11 దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మటకొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా.)

హోషేయ 5:12 ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను యూదావారికి వత్సపురుగు వలెను నేనుందును.

యోబు 6:11 నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల? నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?

యోబు 33:21 వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచుకొని వచ్చును

యెషయా 50:9 ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.

యెషయా 51:8 వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును బొద్దీక గొఱ్ఱబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును.

యాకోబు 5:2 మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.