Logo

యోబు అధ్యాయము 13 వచనము 14

యోబు 18:4 కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా?

ప్రసంగి 4:5 బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును.

యెషయా 9:20 కుడిప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొని యుందురు; ఎడమప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని ఇంకను తృప్తిపొందక యుందురు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును

యెషయా 49:26 యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించెదను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తముచేత వారు మత్తులగుదురు.

న్యాయాధిపతులు 12:3 నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయు లతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నాచేతి కప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను.

1సమూయేలు 19:5 అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల కందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా

1సమూయేలు 28:21 అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకువచ్చి, అతడు బహుగా కలవరపడుట చూచినా యేలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నాచేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసితిని.

కీర్తనలు 119:109 నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను.