Logo

యోబు అధ్యాయము 13 వచనము 16

నిర్గమకాండము 15:2 యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.

కీర్తనలు 27:1 యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?

కీర్తనలు 62:6 ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను.

కీర్తనలు 62:7 నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందేయున్నది.

కీర్తనలు 118:14 యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను.

కీర్తనలు 118:21 నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చియున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.

యెషయా 12:2 ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను

యిర్మియా 3:23 నిశ్చయముగా కొండలమీద జరిగినది మోసకరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్‌ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును.

అపోస్తలులకార్యములు 13:47 ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.

యోబు 8:13 దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును భక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును.

యోబు 27:8 దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది?

యోబు 27:9 వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా?

యోబు 27:10 వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా?

యోబు 36:13 అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.

యెషయా 33:14 సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును?

లూకా 11:41 కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును.

యాకోబు 5:11 సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.