Logo

యోబు అధ్యాయము 13 వచనము 13

యోబు 13:5 మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.

యోబు 7:11 కావున నేను నా నోరు మూసికొనను నా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదను నా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.

యోబు 10:1 నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డులేకుండ అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను

యోబు 21:3 నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.

యోబు 6:9 దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక.

యోబు 6:10 అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదనపడుచుండినను దానిబట్టి హర్షించుదును

యోబు 7:15 కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నాను ఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.

యోబు 7:16 అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదు నా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.

యోబు 1:2 అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

యోబు 13:19 నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు? ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొని ప్రాణము విడిచెదను.

యోబు 32:20 నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.