Logo

ఆదికాండము అధ్యాయము 24 వచనము 4

ఆదికాండము 11:25 నాహోరు తెరహును కనిన తరువాత నూటపందొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:26 తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.

ఆదికాండము 11:27 తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను.

ఆదికాండము 11:28 హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతిబొందెను.

ఆదికాండము 11:29 అబ్రామును నాహోరును వివాహము చేసికొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.

ఆదికాండము 11:30 శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానము లేదు.

ఆదికాండము 11:31 తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.

ఆదికాండము 11:32 తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతిబొందెను.

ఆదికాండము 12:1 యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

ఆదికాండము 12:7 యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.

ఆదికాండము 22:20 ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను.

ఆదికాండము 22:21 వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,

ఆదికాండము 22:22 కెసెదు, హజో, షిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను.

ఆదికాండము 22:23 ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.

ఆదికాండము 28:2 నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి

ఆదికాండము 21:21 అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.

ఆదికాండము 24:8 అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడనియెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను.

ఆదికాండము 24:27 అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను

ఆదికాండము 24:38 అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థులయొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసి కొనిరావలెనని నాచేత ప్రమాణము చేయించెను.

ఆదికాండము 31:53 అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మనమధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను

ద్వితియోపదేశాకాండము 26:5 నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు; అతడు ఐగుప్తునకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయెను.

2దినవృత్తాంతములు 24:3 యెహోయాదా అతనికి యిద్దరు భార్యలను పెండ్లిచేసెను; అతడు కుమారులను కుమార్తెలను కనెను.

సామెతలు 17:2 బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడి చేయును అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచుకొనును.

యిర్మియా 29:6 పెండ్లిండ్లు చేసికొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమియు మీకు తక్కువలేకుండ అభివృద్ధిపొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి.