Logo

ఆదికాండము అధ్యాయము 24 వచనము 17

1రాజులు 17:10 అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.

యోహాను 4:7 సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను.

యోహాను 4:9 ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.

ఆదికాండము 26:1 అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.

ఆదికాండము 26:2 అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.

ఆదికాండము 26:3 ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను;

ఆదికాండము 26:4 ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.

ఆదికాండము 26:5 ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.

ఆదికాండము 26:6 ఇస్సాకు గెరారులో నివసించెను.

ఆదికాండము 26:7 ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె యెవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.

ఆదికాండము 26:8 అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను.

ఆదికాండము 26:9 అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెనుబట్టి నేను చనిపోవుదునేమో అనుకొంటినని అతనితో చెప్పెను.

ఆదికాండము 26:10 అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు గదా అనెను.

ఆదికాండము 26:11 అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికి ఆజ్ఞాపింపగా

ఆదికాండము 26:12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.

ఆదికాండము 26:13 అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమక్రమముగా అభివృద్ధిపొందుచు వచ్చెను.

ఆదికాండము 26:14 అతనికి గొఱ్ఱల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.

ఆదికాండము 26:15 అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి.

ఆదికాండము 26:16 అబీమెలెకు నీవు మాకంటె బహు బలము గలవాడవు గనుక మాయొద్దనుండి వెళ్లిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా

ఆదికాండము 26:17 ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను.

ఆదికాండము 26:18 అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్ళు పెట్టెను

ఆదికాండము 26:19 మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను.

ఆదికాండము 26:20 అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను.

ఆదికాండము 26:21 వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను.

ఆదికాండము 26:22 అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను

ఆదికాండము 26:23 అక్కడనుండి అతడు బెయేర్షెబాకు వెళ్లెను.

ఆదికాండము 26:24 ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామునుబట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసెదనని చెప్పెను.

ఆదికాండము 26:25 అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.

ఆదికాండము 26:26 అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారునుండి అతనియొద్దకు వచ్చిరి.

ఆదికాండము 26:27 ఇస్సాకు మీరు నామీద పగపట్టి మీయొద్దనుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నాయొద్దకు వచ్చియున్నారని వారినడుగగా

ఆదికాండము 26:28 వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితివిు గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలెననియు

ఆదికాండము 26:29 మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితివిు గనుక నీవును మాకు కీడుచేయకుండునట్లు నీతో నిబంధన చేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి.

ఆదికాండము 26:30 అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చు కొనిరి.

ఆదికాండము 26:31 తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతనియొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.

ఆదికాండము 26:32 ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక

ఆదికాండము 26:33 దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా.

ఆదికాండము 26:34 ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లి చేసికొనెను.

ఆదికాండము 26:35 వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.

యెషయా 21:14 తేమాదేశ నివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి

యెషయా 30:25 గోపురములు పడు మహా హత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను వాగులును నదులును పారును.

యెషయా 35:6 కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును

యెషయా 35:7 ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.

యెషయా 41:17 దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.

యెషయా 41:18 జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు

యెషయా 49:10 వారియందు కరుణించువాడు వారిని తోడుకొనిపోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.