Logo

ఆదికాండము అధ్యాయము 24 వచనము 18

సామెతలు 31:26 జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.

1పేతురు 3:8 తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

1పేతురు 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి.

1పేతురు 4:9 సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.

ఆదికాండము 23:6 మా శ్మశానభూములలో అతి శ్రేష్టమైనదానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహాము కుత్తరమిచ్చిరి.

రూతు 2:9 వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహమగునప్పుడు కుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను.

1సమూయేలు 9:11 వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి యున్నాడా అని అడిగిరి.

1రాజులు 17:11 ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచి నాకొక రొట్టెముక్కను నీచేతిలో తీసికొనిరమ్మని చెప్పెను.

సామెతలు 31:13 ఆమె గొఱ్ఱబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులార వాటితో పనిచేయును.