Logo

ఆదికాండము అధ్యాయము 49 వచనము 4

యాకోబు 1:6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

యాకోబు 1:7 అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు

యాకోబు 1:8 గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.

2పేతురు 2:14 వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులునైయుండి,

2పేతురు 3:16 వీటినిగూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.

ఆదికాండము 46:8 యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే;

సంఖ్యాకాండము 32:1 రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని

సంఖ్యాకాండము 32:2 వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో

సంఖ్యాకాండము 32:3 అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా

సంఖ్యాకాండము 32:4 ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు.

సంఖ్యాకాండము 32:5 కాబట్టి మాయెడల నీకు కటాక్షము కలిగినయెడల, మమ్మును యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా

సంఖ్యాకాండము 32:6 మోషే గాదీయులతోను రూబేనీయులతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా?

సంఖ్యాకాండము 32:7 యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్లకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు?

సంఖ్యాకాండము 32:8 ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా

సంఖ్యాకాండము 32:9 వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లకపోయిరి.

సంఖ్యాకాండము 32:10 ఆ దినమున యెహోవా కోపము రగులుకొని

సంఖ్యాకాండము 32:11 ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశములోనుండి వచ్చిన మనుష్యులలో పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప

సంఖ్యాకాండము 32:12 మరి ఎవడును పూర్ణమనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను.

సంఖ్యాకాండము 32:13 అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా యెహోవా దృష్ఠికి చెడునడత నడిచిన ఆ తరమువారందరు నశించువరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను.

సంఖ్యాకాండము 32:14 ఇప్పుడు ఇశ్రాయేలీయులయెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు.

సంఖ్యాకాండము 32:15 మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లినయెడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంక నిలువచేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసెదరనెను.

సంఖ్యాకాండము 32:16 అందుకు వారు అతనియొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందలకొరకు దొడ్లను మా పిల్లలకొరకు పురములను కట్టుకొందుము.

సంఖ్యాకాండము 32:17 ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చువరకు మేము వారిముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయముచేత ప్రాకారముగల పురములలో నివసింపవలెను.

సంఖ్యాకాండము 32:18 ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా యిండ్లకు తిరిగిరాము.

సంఖ్యాకాండము 32:19 తూర్పుదిక్కున యొర్దాను ఇవతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి.

సంఖ్యాకాండము 32:20 అప్పుడు మోషే వారితో మీరు మీ మాటమీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన యెదుటనుండి తన శత్రువులను వెళ్లగొట్టువరకు

సంఖ్యాకాండము 32:21 యెహోవా సన్నిధిని మీరందరు యుద్ధసన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్లినయెడల

సంఖ్యాకాండము 32:22 ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగివచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులైయుందురు; అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును.

సంఖ్యాకాండము 32:23 మీరు అట్లు చేయనియెడల యెహోవా దృష్టికి పాపము చేసినవారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి.

సంఖ్యాకాండము 32:24 మీరు మీ పిల్లలకొరకు పురములను మీ మందలకొరకు దొడ్లను కట్టుకొని మీ నోటనుండి వచ్చిన మాటచొప్పున చేయుడనెను.

సంఖ్యాకాండము 32:25 అందుకు గాదీయులును రూబేనీయులును మోషేతో మా యేలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసెదము.

సంఖ్యాకాండము 32:26 మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును.

సంఖ్యాకాండము 32:27 నీ దాసులమైన మేము, అనగా మా సేనలో ప్రతి యోధుడును మా యేలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యొర్దాను అవతలికి వచ్చెదమనిరి.

సంఖ్యాకాండము 32:28 కాబట్టి మోషే వారినిగూర్చి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలీయుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను

సంఖ్యాకాండము 32:29 గాదీయులును రూబేనీయులును అందరు యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్దపడి మీతోకూడ యొర్దాను అవతలికి వెళ్లినయెడల ఆ దేశము మీచేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను.

సంఖ్యాకాండము 32:30 అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్లనియెడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదురనగా

సంఖ్యాకాండము 32:31 గాదీయులును రూబేనీయులును యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము.

సంఖ్యాకాండము 32:32 మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమై నదిదాటి కనాను దేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి.

సంఖ్యాకాండము 32:33 అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను.

సంఖ్యాకాండము 32:34 గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను

సంఖ్యాకాండము 32:35 యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను

సంఖ్యాకాండము 32:36 అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి.

సంఖ్యాకాండము 32:37 రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను

సంఖ్యాకాండము 32:38 షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి.

సంఖ్యాకాండము 32:39 మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి.

సంఖ్యాకాండము 32:40 మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను

సంఖ్యాకాండము 32:41 అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.

సంఖ్యాకాండము 32:42 నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.

ద్వితియోపదేశాకాండము 33:6 రూబేను బ్రదికి చావకయుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు.

ఆదికాండము 35:22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.

ద్వితియోపదేశాకాండము 5:21 నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు; నీ పొరుగువాని యింటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినినైనను వాని యెద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.

ద్వితియోపదేశాకాండము 27:20 తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

1దినవృత్తాంతములు 5:1 ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మస్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు.

1కొరిందీయులకు 5:1 మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.

ఆదికాండము 19:30 లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.

ఆదికాండము 29:32 లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.

నిర్గమకాండము 6:14 వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.

లేవీయకాండము 18:8 నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.

సంఖ్యాకాండము 1:20 ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలుబది యారువేల ఐదు వందలమంది యైరి.

సంఖ్యాకాండము 2:10 రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణదిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 16:1 లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని

ద్వితియోపదేశాకాండము 27:13 రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను.

2సమూయేలు 3:2 హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయురాలగు అహీనోయమువలన పుట్టెను.

2సమూయేలు 16:21 అహీతోపెలు నీ తండ్రిచేత ఇంటికి కావలియుంచబడిన ఉపపత్నులయొద్దకు నీవు పోయినయెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షమున నున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను.

2రాజులు 1:16 అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే; నీవెక్కిన మంచముమీదనుండి దిగిరాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను.

1దినవృత్తాంతములు 2:1 ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను

సామెతలు 6:33 వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.

యెహెజ్కేలు 22:10 తమ తండ్రి మానాచ్ఛాదనము తీయువారు నీలో నున్నారు, అశుచియై బహిష్టియైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు.

యెహెజ్కేలు 48:6 ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము.

మీకా 7:6 కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు.

మత్తయి 11:7 వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?

లూకా 7:24 యోహానుదూతలు వెళ్లిన తరువాత, ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా?